News February 11, 2025

ఆ చట్టం రద్దుతో అదానీకి ప్రయోజనం!

image

డొనాల్డ్ ట్రంప్ <<15426089>>FCPA<<>> చట్టాన్ని సస్పెండ్ చేయడంతో భారత వ్యాపారి గౌతమ్ అదానీకి ఊరట లభించే అవకాశముంది. ఇప్పటికిప్పుడు అభియోగాలను రద్దుచేసే అవకాశమైతే లేదు గానీ విచారణను నిలిపివేస్తారు. అటార్నీ జనరల్ పామ్ బొండి సవరణలతో కూడిన చట్టాన్ని తీసుకురాగానే దాని ఆధారంగా విచారణ ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం కోసం నజరానాలు ఇవ్వడం నేరం కాదని ట్రంప్ నొక్కి చెబుతుండటంతో చట్టం తీరుతెన్నులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

Similar News

News February 11, 2025

రామ్మోహన్ నాయుడుకు ‘యువ వక్త’ పురస్కారం

image

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గుర్తింపు లభించింది. పుణేలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ ఆయనకు ‘ఉత్తమ యువ వక్త ఆఫ్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్’ అవార్డును ప్రదానం చేసింది. అతి పిన్న వయస్సులో ఎంపీగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రామ్మోహన్ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారని నిర్వాహకులు కొనియాడారు. కాగా ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు.

News February 11, 2025

నితీశ్ అలసిపోయారు.. మానసికంగా రిటైరైపోయారు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ CM నితీశ్ కుమార్‌పై జనసూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తాజాగా విమర్శలు గుప్పించారు. ‘ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్రం జరగనుంది. ఎన్డీయే గెలిచినా సరే నితీశ్ మాత్రం ఇక బిహార్ సీఎంగా కొనసాగరు. ఆయన పరిస్థితి బాలేదు. శారీరకంగా అలసి, మానసికంగా రిటైరైపోయారు. కనీసం తన మంత్రుల పేర్లు చెప్పే పరిస్థితిలో కూడా లేరు. బిహార్‌లో ఆయన ఇప్పుడు బీజేపీకి ఒక ముసుగు మాత్రమే’ అని పేర్కొన్నారు.

News February 11, 2025

బీచ్ ఫొటోలు ఎడిట్.. హీరోయిన్ ఆగ్రహం

image

ఒక నటిగా అందాన్ని ప్రదర్శించడంలో తాను జాగ్రత్తగా ఉంటానని మలయాళ నటి పార్వతీ R కృష్ణ చెప్పారు. అయితే ఇటీవల బీచ్ ఫొటో షూట్‌లో పాల్గొన్న దృశ్యాలను కొందరు యూట్యూబర్లు అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన సమస్యపై ఇతరులు ఎందుకు స్పందించరో అర్థం కావట్లేదన్నారు. ఈమె ఏంజెల్స్, మాలిక్ తదితర చిత్రాల్లో నటించారు.

error: Content is protected !!