News February 11, 2025

దేవుడి పేరుతో దాడులు దురదృష్టకరం: మంత్రి

image

TG: వీర రాఘవరెడ్డి, అతడి అనుచరుల దాడిలో గాయపడ్డ చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. దేవుడి పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామని, ఆలయం వద్ద భద్రత పెంచుతామని చెప్పారు. అటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఇతర నేతలు సైతం రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.

Similar News

News March 15, 2025

సౌతాఫ్రికా రాయబారికి ట్రంప్ సర్కారు షాక్

image

తమ దేశంలోని దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్‌కు ట్రంప్ సర్కారు షాకిచ్చింది. ఆయన తమ దేశంలో ఉండటానికి వీల్లేదని, వెంటనే స్వదేశానికి పయనమవ్వాలని తేల్చిచెప్పింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘ఇబ్రహీం ఓ జాత్యహంకార రాజకీయ నేత. అమెరికన్లను, మా అధ్యక్షుడిని ద్వేషిస్తున్నారు. ఆయనతో మాట్లాడేదేం లేదు. దేశం నుంచి పంపించేయడమే’ అని పేర్కొన్నారు.

News March 15, 2025

హిందీ భాషపై కామెంట్స్.. పవన్‌పై వైసీపీ విమర్శలు

image

AP: జయకేతనం సభలో ‘హిందీ మన భాషే కదా?’ అన్న పవన్ <<15763560>>కళ్యాణ్‌పై<<>> YCP విమర్శలు గుప్పిస్తోంది. అప్పట్లో ‘హిందీ గో బ్యాక్’ అనే పేపర్ ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేయడాన్ని గుర్తుచేస్తోంది. ఆ ఆర్టికల్‌పై స్పందించిన ఆయన ‘నార్త్ ఇండియా రాజకీయ నేతలు మనదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకొని, గౌరవించాలి’ అని రాసుకొచ్చారు. మరి ఇప్పుడేమో జనసేనానికి హిందీపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటూ ప్రశ్నలు సంధిస్తోంది.

News March 15, 2025

నిద్రలేమితో అనారోగ్యమే!

image

మనిషికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక నిద్రలేమికి సంకేతమని చెబుతున్నారు. నిద్రలేమితో కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సరైన నిద్ర ఉంటే 30-60% రోగుల్లో ఆల్జీమర్స్, గుండె జబ్బులు తగ్గుతున్నాయని తెలిపారు. ఏకధాటిగా 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!