News March 20, 2024

ADB: హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్‌కు

image

ఒకరిపై కత్తితో దాడిచేసి కేసులో ఇద్దరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోలిపూరకు చెందిన మునీర్ బేగ్‌పై సోమవారం రాత్రి 11 గంటలకు కేఆర్కే కాలనీకి చెందిన షేక్ షాబాద్, సయ్యద్ రెహాన్ హష్మీ కత్తితో దాడితో చేశారు. బాధితుడి తల్లి గులాబ్ బీ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News

News July 7, 2025

ఆదిలాబాద్: కంట్లో కారం చల్లి, బండరాళ్లతో కొట్టి హత్య

image

లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో <<16964169>>మహిళ <<>>మృతదేహం ఆదివారం లభ్యమైన విషయం తెలిసిందే. ఇంద్రవెల్లి(M) నర్సాపూర్‌ వాసి వందన(45), ADB వాసి శంకర్‌‌ను పెళ్లిచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా చంపాలని భావించి ఈనెల 2న లక్ష్మిపూర్ అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. కంట్లో కారం చల్లి, తలపై బండరాళ్లతో కొట్టి హత్యచేశాడు. తండ్రిపై అనుమానంతో కూతురు PSలో ఫిర్యాదు చేయగా హత్య చేసినట్లు శంకర్ అంగీకరించాడు.

News July 6, 2025

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ADB SP

image

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరాలకు గురైన
వారు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టం జరిగిన వాటిని తిరిగి రప్పించే అవకాశం ఉంటుందన్నారు. గతవారం జిల్లాలో దాదాపు సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News July 6, 2025

ADB: యువతులను వేధిస్తున్న యువకుడిపై కేసు

image

యువతులు, మహిళలను వేధిస్తున్న యువకుడి పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అనీస్ అనే యువకుడు స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్న మహిళలు, యువతులను వేధించడంతో అతనిపై కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సమాచారం అందుకున్న షీటీం సిబ్బంది రైల్వే స్టేషన్ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.