News February 11, 2025

ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావాలి: పీఎం మోదీ

image

ఏఐ టెక్నాలజీ అన్ని దేశాలకూ అందుబాటులోకి రావాలని పారిస్‌లో జరిగిన ఏఐ శిఖరాగ్ర సదస్సులో PM మోదీ అన్నారు. ‘ఏఐ అనేది ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక వ్యవస్థల్ని సమూలంగా మార్చేస్తోంది. ఈ శతాబ్దంలో మానవాళికి ఏఐ కోడ్ వంటిది. శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతే వేగంగా ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఏఐలో మా అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధం’ అని పేర్కొన్నారు.

Similar News

News February 12, 2025

HEADLINES

image

* గత ఐదేళ్ల విధ్వంసంతో వెనుకబడ్డాం: CM చంద్రబాబు
* పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయం: KCR
* ఈ జన్మకు రాజకీయాలకు దూరంగా ఉంటా: చిరంజీవి
* కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: KTR
* తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు
* జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
* ఏపీ, టీజీలో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. ప్రభుత్వాలు అప్రమత్తం

News February 12, 2025

రోహిత్, కోహ్లీ వారిద్దరితో మాట్లాడాలి: కపిల్ దేవ్

image

భారత స్టార్లు కోహ్లీ, రోహిత్ మాజీ ప్లేయర్లతో మాట్లాడాలని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సూచించారు. రోహిత్ గత వన్డేలో సెంచరీ చేశారు. అయితే ఆయన, కోహ్లీ టెస్టుల్లో ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నారు. ‘వయసవుతున్న మాత్రాన రోహిత్, కోహ్లీ ఒక్కసారిగా ఆటను మర్చిపోరు. కానీ వారి శరీరం అడ్జస్ట్ చేసుకునే తీరు మారుతుంటుంది. దీనిపై గవాస్కర్, ద్రవిడ్ వంటివారితో ఆ ఇద్దరూ మాట్లాడాలి’ అని కపిల్ పేర్కొన్నారు.

News February 12, 2025

పబ్లిక్‌లో పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదు: ఢిల్లీ కోర్టు

image

బార్‌లో అశ్లీల నృత్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బహిరంగంగా పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదంది. వారి డాన్స్ ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పొట్టి దుస్తులు ధరించి అశ్లీల డాన్స్ చేశారంటూ గత ఏడాది పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనివల్ల ఇబ్బందిపడిన సాక్షులను ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.

error: Content is protected !!