News February 11, 2025
మెదక్ జిల్లాలో రూ.84,40,52,317 జమ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. గత రెండు రోజుల కింద ఎకరంలోపు సాగు చేసుకునే రైతులకు వారి అకౌంట్లో జమ చేసింది. సోమవారం రెండు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకు విడుదల చేయగా మెదక్ జిల్లాలోని మొత్తం 1,72,349 మంది రైతులకు రూ.84,40,52,317 జమ చేశారు. దీని పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 12, 2025
ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సులో మెదక్ కలెక్టర్
ఢిల్లీలో జరిగిన తదుపరి తరం పరిపాలనా సంస్కరణల అంతర్జాతీయ సదస్సుకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌గా మూడు జిల్లాల్లో పనిచేసిన పాలనాపరమైన అనుభవాలను దేశ, విదేశీ ప్రతినిధులతో పంచుకున్నారు. మంగళవారం ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, భారత ప్రభుత్వ ఆధీనంలోని పరిపాలనా సంస్కరణల విభాగం సంయుక్తంగా సదస్సు నిర్వహించారు.
News February 11, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: అదనపు కలెక్టర్
పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు.మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మెదక్, నిజామాబాద్ అదిలాబాద్ , కరీంనగర్ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన పిఓలు, ఏపిఓలు, సెక్టార్, నోడల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
News February 11, 2025
మెదక్: శవం వద్ద మెడికల్ విద్యార్థుల ప్రమాణం
మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్‌కి ముందు వారికి విజ్ఞానాన్ని పంచే శవం వద్ద ప్రమాణం చేశారు. ఎల్లప్పుడు గౌరవాన్ని, విఘ్నతను కలిగి ఉంటామని కృతజ్ఞులమై ఉంటామని వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రకుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిశంకర్, డాక్టర్ జయ, అనాటమీ విభాగం డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.