News February 11, 2025

గాజువాకలో గంజాయి స్వాధీనం

image

కణితి రోడ్డులోని ఓ ఇంట్లో గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో గాజువాక పోలీసులు మంగళవారం తనిఖీలు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ తనిఖీలలో 184 కేజీల గంజాయి, ఒక కారు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇమ్రాన్ ఖాన్, అర్జున్ కుమార్, కోరాడ బాలాజీ కృష్ణ, బిదేశి కుమార్ సాహు, దామా ఖరా, శుక్రమతం, రామచంద్ర సిషా, మనోజ్ ఖేముండు ఉన్నట్లు తెలిపారు.

Similar News

News February 12, 2025

విశాఖ: వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష

image

కేంద్ర పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కేంద్ర బృందం డాక్టర్ పాదాలు, రమణ మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది, అధికారుల పని తీరు సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి సిబ్బంది హాజరును పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో DMHO జగదీశ్వరరావు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.

News February 11, 2025

షీలానగర్-పోర్టు రోడ్డులో యాక్సిడెంట్ 

image

షీలానగర్-పోర్టు రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాకకు చెందిన ఎం.నరసింహారావు సైకిల్‌పై టీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం టీ పట్టుకొని వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు.

News February 11, 2025

విశాఖ: పదో తరగతి పరీక్షకు 29,997 మంది

image

విశాఖలో మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒక‌టో తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి సీతారామారావు ఆదేశించారు.మంగళవారం ఆయన అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు.విశాఖలో 134 కేంద్రాల్లో రెగ్యుల‌ర్ విద్యార్థులు 28,523, ఓపెన్ విద్యార్థులు 1,404 మొత్తం 29,997 మంది హాజ‌ర‌వుతున్నార‌ని డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు.

error: Content is protected !!