News February 11, 2025

తిరుపతి: 41.5 కేజీల గంజాయి స్వాధీనం

image

తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఫిబ్రవరి మొదటి వారపు గణాంకాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు కార్యాలయం తెలిపింది. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ సుమారు 41.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించే వారిపై 913 కేసులను నమోదు చేసి, 913 మందికి కోర్టులో జరిమానాలు విధించినట్లు చెప్పారు.

Similar News

News February 24, 2026

NZB: అరైవ్ అలైవ్ వారోత్సవాలు.. విద్యార్థులకు అవగాహన

image

రోడ్డు ప్రమాదాల నివారణలో ముందస్తు అవగాహనే అత్యంత కీలకమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. అలైవ్ అరైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు అంబాసిడర్‌గా ఉండి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News February 24, 2026

శ్రీకాకుళంలో డయేరియా కలకలం

image

AP: రాజమండ్రి <<19216426>>కల్తీ<<>> పాల ఘటన మరువక ముందే శ్రీకాకుళంలో భారీగా డయేరియా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ఈరోజు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఒక్కరోజే 25 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 76కు చేరింది. బాధితులు జీజీహెచ్, కిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని <<19224272>>సీఎం<<>> ఇప్పటికే అధికారులకు సూచించారు.

News February 24, 2026

నస్పూర్: వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

మంచిర్యాల జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.