News February 11, 2025

18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ

image

సుమారు 18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ జరిగేదని UK పరిశోధకులు తెలిపారు. పోలాండ్‌లోని ఓ గుహలో దొరికిన అవశేషాలపై అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘ఆ ఎముకల మీద ఉన్న గుర్తుల్ని బట్టి అవి నరమాంస భక్షణకు గురైనట్లుగా గుర్తించాం. కాళ్లూచేతుల్ని ముక్కలుగా నరకడం, మెదడును బయటికి తీయడం వంటి పలు ఆనవాళ్లు వాటిపై ఉన్నాయి. 2 గ్రూపుల మధ్య యుద్ధంలో విజేతలు ఓడినవారిని తినేసి ఉండొచ్చు’ అని అంచనా వేశారు.

Similar News

News February 12, 2025

భార్యతో బలవంతపు అసహజ శృంగారం నేరం కాదు: హైకోర్టు

image

భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. ‘15 ఏళ్లు దాటిన భార్యతో భర్త చేసే ఏ శృంగారాన్నీ అత్యాచారంగా పరిగణించలేం. ఆమె ఒప్పుకోనప్పటికీ అసహజ శృంగారానికీ ఇది వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించింది. అసహజ శృంగారం కారణంగా ఓ వ్యక్తి భార్య చనిపోయింది. అతడికి కింది కోర్టులో శిక్ష పడగా హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

News February 12, 2025

రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో ఆయన భారత సైన్యాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సరిహద్దు రోడ్ల సంస్థ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ కేసు పెట్టారు. ఆ కేసు విచారణను స్వీకరించిన కోర్టు, వచ్చే నెల ఆఖరి వారంలో విచారణకు హాజరుకావాలని రాహుల్‌ని ఆదేశించింది.

News February 12, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!