News February 11, 2025
తాడ్వాయిలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం తాడ్వాయిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడ్వాయి గ్రామానికి చెందిన మైసయ్య(50) గ్రామపంచాయతీలో వర్కర్‌గా పని చేస్తున్నారు. టిప్పర్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయారని స్థానికులు పేర్కొన్నారు.
Similar News
News January 7, 2026
నెల్లూరు: 15 మండలాలకు స్వచ్ఛ రథాలు.!

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.
News January 7, 2026
HYDలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

సంక్రాంతి సందర్భంగా HYDలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 16- 18 వరకు పరేడ్ గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. అలాగే పరేడ్ గ్రౌండ్, బతుకమ్మ కుంట, నల్ల చెరువు తదితర ప్రాంతాల్లో పతంగులు, మిఠాయిల పండుగ నిర్వహిస్తారు. వీటితో పాటు జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా డ్రోన్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు.
News January 7, 2026
సచిన్ ఇంట పెళ్లి బాజాలు.. అర్జున్ పెళ్లి డేట్ ఫిక్స్!

సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్, వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి మార్చి 5న జరగనున్నట్లు TOI పేర్కొంది. 2025 ఆగస్టులోనే వీరి నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగింది. మార్చి 3 నుంచి ముంబైలో పెళ్లి వేడుకలు షురూ కానున్నాయి. ఇటీవలే అర్జున్ నిశ్చితార్థాన్ని సచిన్ ధ్రువీకరించారు.


