News February 11, 2025

మన్యం బంద్ నిర్ణయం వెనక్కి

image

AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా చేపడుతున్న మన్యం బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 1/70 చట్టం అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన <<15427067>>హామీ<<>> ఇవ్వడంతో రేపు నిర్వహించతలపెట్టిన బంద్‌ను రద్దు చేస్తున్నట్లు నేతలు తెలిపారు.

Similar News

News March 12, 2025

Stock Markets: టెక్ షేర్లు విలవిల..

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,470 (-27), సెన్సెక్స్ 74,029 (-72) వద్ద స్థిరపడ్డాయి. PVT బ్యాంకు, హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, బ్యాంకు, చమురు, ఎనర్జీ షేర్లు ఎగిశాయి. ఐటీ, రియాల్టి, మీడియా, PSU బ్యాంకు, వినియోగ, మెటల్ షేర్లు ఎరుపెక్కాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటామోటార్స్, కొటక్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ టాప్ గెయినర్స్. ఇన్ఫీ, విప్రో, టెక్ఎం, నెస్లే, TCS టాప్ లూజర్స్.

News March 12, 2025

EAPCET నోటిఫికేషన్ విడుదల

image

AP: EAPCET <<15723472>>నోటిఫికేషన్‌ను <<>>JNTU కాకినాడ విడుదల చేసింది. దీని ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.

News March 12, 2025

ఒకే ఫ్రేమ్‌లో నాని, విజయ్ దేవరకొండ, మాళవిక

image

నాని, విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా ఈనెల 21న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటీనటులు 10 ఏళ్ల తర్వాత ఒక్కచోటకు చేరారు. సినిమాలో ఉన్నట్లు ఒకే బైక్‌పై ముగ్గురు కూర్చొని కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇన్నేళ్లలో ఎన్నో మార్పులొచ్చినా వీరి బాండింగ్ మారలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!