News February 11, 2025

మల్కాజిగిరి: మహిళల రక్షణే ధ్యేయం: డీసీపీ 

image

మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీం పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్ హెచ్చరించారు. నెల రోజుల్లో 163 మంది పోకిరిలను సాక్యాధారాలతో సహా పట్టుకుని న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోఈవ్ టీజర్లకు క్యాంపు కార్యాలయంలో మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.

Similar News

News January 8, 2026

శ్రీ ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం

image

అప్పులు, ఆర్థిక ఒత్తిడి, రుణ భారంతో మనశ్శాంతి కోల్పోతున్నారా? ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? శ్రీ ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం ద్వారా రుణ బంధనాలు శమించి, ఆర్థిక అడ్డంకులు తొలగి, ధన ప్రవాహం మెరుగవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుల నుంచి విముక్తి, ఆర్థిక స్థిరత్వం, శాంతి కోసం ఈ హోమం శ్రేయస్కరంగా భావించబడుతుంది. మీ పేరు & గోత్రంతో వేదమందిర్‌లో ఇప్పుడే <>బుక్ చేసుకోండి<<>>.

News January 8, 2026

సిరిసిల్ల: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 61 మందిపై కేసు

image

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 61 మందిపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. బుధవారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా 61 మంది బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారని, మరో 55 మంది సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారని తెలిపారు. వీరందరిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించవద్దని, మద్యం సేవించి వాహనం నడపవద్దని ఆయన సూచించారు.

News January 8, 2026

తిరుపతిలో టోకెన్ల జారీ ప్రారంభం

image

తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో SSD టోకెన్లు జారీ గురువారం నుంచి ప్రారంభమైంది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో గత నెల 29న జారీ నిలిపివేశారు. తిరిగి గురువారం నుంచి ప్రారంభం కావడంతో భక్తులు రద్దీ సాధారణం కొనసాగుతోంది. ప్రస్తుతం 4వేలు SSD, 900 శ్రీవారి మెట్టు టోకెన్లు అందుబాటులో ఉన్నాయి.