News February 11, 2025

చిన్నారి మృతి దురదృష్టకరం: మంత్రి

image

తాడేపల్లి అంగన్వాడీ సెంటర్లో అన్నం తిన్న వెంటనే నులిపురుగుల మాత్రను వేయడంతో, గొంతులో అడ్డం పడి చిన్నారి మృతి చెందడం బాధాకరమని గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి కత్తుల రస్మిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చిన్నారి మృతిపై దర్యాప్తు చేసి అంగన్వాడీ టీచర్, ఆయా, సూపర్వైజర్లను సస్పెండ్ చేశామన్నారు.

Similar News

News November 18, 2025

కరీంనగర్: కన్న కూతురిని చంపిన తండ్రి అరెస్ట్

image

KNR వావిలాలపల్లిలో కూతురిని హత్యచేసిన నిందితుడు మల్లేశంను KNR బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు 3టౌన్ CI జన్ రెడ్డి తెలిపారు. మానసిక, శారీరక వైకల్యం ఉన్న కూతురు హర్షిత, కొడుకు హర్షిత్‌ను మల్లేశం టవల్‌తో ఉరివేయగా కుమార్తె మృతి చెందింది. కాగా వీరిని ఆస్పత్రులలో చూపెట్టినా వ్యాధి తగ్గకపోవడంతో మానసిక వేదనతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని CI పేర్కొన్నారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

image

TG: హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్‌తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.