News February 11, 2025
ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు కోహ్లీనే: గేల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739276510894_1045-normal-WIFI.webp)
ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీయేనని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డారు. రికార్డులే ఆ మాట చెబుతాయని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఇప్పటికీ విరాటే అత్యుత్తమ ఆటగాడు. ఆయన ఫామ్ కొంచెం డౌన్ అయిందంతే. తిరిగి పుంజుకుని కెరీర్‌ను బలంగా ముగిస్తారని అనుకుంటున్నా. ఇక రోహిత్ అద్భుతమైన ఎంటర్‌టైనర్. సిక్సుల్లో ఆయనే ఇప్పుడు కింగ్’ అని కొనియాడారు.
Similar News
News February 12, 2025
మంచి మాట – పద్యబాట
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739310350217_893-normal-WIFI.webp)
లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
భావం: శారీరకంగా బలంగా ఉన్నవాడికంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా మచ్చిక చేసుకుని దానిమీదకు ఎక్కగలడు.
News February 12, 2025
నన్ను రాజకీయాల్లోకి లాగకండి: విశ్వక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739302208751_893-normal-WIFI.webp)
తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్‌సేన్ నెటిజన్లను కోరారు. తాను మిడిల్ ఫింగర్ చూపిస్తున్న పోస్టర్ నెల రోజుల క్రితం విడుదలైందని, రెడ్ సూట్ ఫొటో కూడా ఇప్పటిది కాదని చెప్పారు. ‘ప్రతీసారి తగ్గను. కానీ నిన్న మనస్ఫూర్తిగా <<15423495>>సారీ<<>> చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. శాంతంగా ఉండండి. అసభ్య పదజాలం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైలాను బాయ్‌కాట్ చేయాలన్న ఆలోచనను బాయ్‌కాట్ చేయండి’ అని X పోస్ట్ పెట్టారు.
News February 12, 2025
అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తాం: భట్టి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739304930304_893-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ <<15416781>>డిమాండ్<<>> పెరుగుతున్న నేపథ్యంలో TGSPDCL అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం నిర్వహించారు. వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై చర్చించారు. రానున్న రోజుల్లో డిమాండ్ ఎంత పెరిగినా రెప్పపాటు అంతరాయం లేకుండా అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా 1912 టోల్ ప్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.