News February 11, 2025

నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!

image

టీడీపీ నేత, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సోదరుడు గాలి జగదీశ్ వైసీపీలో చేరికకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు వైసీపీలో చేరేందుకు మాజీ సీఎం జగన్‌తో వైసీపీ కేంద్రకార్యాలయంలో భేటీ అయ్యారు. గాలి జగదీశ్ చేరికకు మాజీ మంత్రి రోజా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన చేరికను వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గాలి జగదీశ్ నగరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 14, 2025

దోమ: ఒకే ఈతలో రెండు దూడలు..

image

ఒకే ఈతలో రెండు లేగ దూడలు జన్మించిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాలపల్లి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకన్న ఒక ఆవు ఉంది. ఆ ఆవుకు ఒక లేగ దూడను జన్మనివ్వగా మరి కొద్దిసేపటి తర్వాత మరో లేగ దూడకు జన్మనిచ్చిందని వెంకన్న తెలిపారు. తన ఆవుకు రెండు లేగ దూడలు జన్మించడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండు దూడలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని మాజీ సర్పంచ్ వెంకన్న తెలిపారు.

News March 14, 2025

ట్రైన్ హైజాక్: పాక్ ఆరోపణల్ని తిప్పికొట్టిన భారత్

image

బలూచిస్థాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో విదేశీ జోక్యంపై పాక్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి జన్మస్థానమేదో ప్రపంచం మొత్తానికీ తెలుసని పేర్కొంది. ‘పాక్ నిరాధార ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. వారి అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించడం, వేలెత్తి చూపడం మానేసి అంతర్మథనం చేసుకోవాలి’ అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. BLAకు అఫ్గాన్ సాయం, భారత్‌పై వైఖరి మారలేదని పాక్ నిన్న ఆరోపించింది.

News March 14, 2025

ఒక్కరోజే రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర రూ.2,000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.

error: Content is protected !!