News February 11, 2025
ఏ బీరుపై ఎంత రేటు పెరిగిందంటే?

TG: రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ్టి నుంచి 15% పెరిగాయి. KF స్ట్రాంగ్ రేటు రూ.160 నుంచి రూ.184కు, లైట్ రూ.150 నుంచి రూ.172కు, అల్ట్రా మాక్స్ రూ.220 నుంచి రూ.253కు చేరాయి. అలాగే బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241కు, మ్యాగ్నం రూ.220 నుంచి రూ.253కు, టుబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
Similar News
News December 26, 2025
ఆయుష్ సర్జరీలు CM, మంత్రులకూ చేయాలి: పీవీ రమేశ్

AP: PG <<18651050>>ఆయుర్వేద<<>> వైద్యులను సర్జరీలు చేసేందుకు అనుమతించడంపై రిటైర్డ్ IAS PV రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘AP కిరీటంలో ఇదో కలికితురాయి. ఈ ఆయుష్ శస్త్రచికిత్సలను ఉద్యోగులకే కాకుండా CM, Dy CM, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకూ తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాం’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. వినూత్న ఆవిష్కరణలతో ఆంధ్రులను ముంచెత్తుతున్నారని వెటకారమాడారు.
News December 26, 2025
డీలిమిటేషన్: GHMCలో కొత్తగా 6 జోన్లు

TG: GHMC డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి, డివిజన్లను 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌లను కొత్త జోన్లుగా పేర్కొంది.
News December 26, 2025
మతపరమైన గొడవ కాదు.. అతడో క్రిమినల్: బంగ్లా సర్కార్

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు <<18670618>>అమృత్ మండల్<<>> హత్యకు గురికావడంపై అక్కడి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘ఇది మతపరంగా జరిగిన ఘర్షణ కాదు. అమృత్ మండల్ ఓ టాప్ క్రిమినల్. అతను ఓ ఏరియాలో డబ్బులు డిమాండ్ చేసేందుకు రాగా స్థానికులతో జరిగిన గొడవలో చనిపోయాడు’ అని పేర్కొంది. కాగా దీపూ చంద్రదాస్ హత్య తర్వాత మరో హిందూ హత్యకు గురికావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


