News February 11, 2025

హనుమకొండ: చికెన్ సెంటర్ యజమానికి రూ.30 వేల పెనాల్టీ

image

అపరిశుభ్ర ప్రదేశంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న యజమానికి రూ.30 వేలు పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్యఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి తెలిపారు. న్యూశాయంపేటలోని వినాయక చికెన్ సప్లయర్స్ యాజమాన్యం సరియైన హైజీన్ పద్ధతులు పాటించడం లేదని ఆయన అన్నారు. దుకాణ ఆవరణ అపరిశుభ్రంతో పాటు చికెన్ వ్యర్థాలను డ్రైనేజీలో వదిలినందకు పెనాల్టీ విధించామన్నారు.

Similar News

News February 12, 2025

జనగామ: మున్సిపాలిటీ వార్డు అధికారులతో కలెక్టర్ సమీక్షా

image

జనగామ మున్సిపాలిటీ వార్డు అధికారులతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని టాక్సీ వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, ప్లాంటేషన్ తదితర విషయాలపై చర్చించారు. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్‌లపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటి పరిధిలో రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

News February 12, 2025

నేడే మూడో ODI.. జట్టులోకి పంత్, అర్ష్‌దీప్?

image

ఇండియా, ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ మూడో వన్డే జరగనుంది. IND తుది జట్టులోకి రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్‌దీప్ వచ్చే అవకాశముంది. ఈ పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు కఠినంగా, బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, డ్యూ కూడా వచ్చే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. sports 18-2, హాట్‌స్టార్‌లో మ.1.30 నుంచి లైవ్ చూడవచ్చు. WAY2NEWSలో లైవ్ స్కోర్ అప్‌డేట్స్ పొందవచ్చు.

News February 12, 2025

ఖమ్మం: రూ.91 లక్షలకు వ్యాపారి దివాలా పిటిషన్

image

ఖమ్మం పట్టణం శ్రీనివాస నగర్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.91,04,593 లకు దివాళా పిటిషన్‌ దాఖలు చేశాడు. ఫిర్యాదుదారుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అధిక వడ్డీలకు పలువురి వద్ద అప్పు చేశారు. వ్యాపారంలో తీవ్రంగా నష్టం రావడంతో అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో పదిమంది రుణదాతలను ప్రతివాదులుగా చేరుస్తూ దివాలా పిటిషన్ మంగళవారం స్థానిక కోర్టులో దాఖలు చేశాడు.

error: Content is protected !!