News February 11, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.18,59,854 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News February 28, 2026
అనంత: హాకీలో సత్తా చాటిన యువకుడు యువన్ క్రిష్

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంట్‌లో యువకుడు యువన్ క్రిష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న యువన్ క్రిష్ అండర్ 10 హాకీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. భవిష్యత్తులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పాఠశాల హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
News February 28, 2026
కాకినాడ విషాదం.. ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం

AP: కాకినాడ(D) వేట్లపాలెంలో జరిగిన భారీ <<19263594>>పేలుడు<<>> ఘటనలో 20 మంది మృతిచెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వేట్లపాలెంలో బాధితులను పరామర్శించిన అనంతరం తెలిపారు.
News February 28, 2026
భద్రాచలం: నవమి వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి!

భద్రాచలంలో మార్చి 27, 28 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణం, మహా పట్టాభిషేక ఉత్సవాలకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.


