News February 11, 2025

బీచ్ ఫొటోలు ఎడిట్.. హీరోయిన్ ఆగ్రహం

image

ఒక నటిగా అందాన్ని ప్రదర్శించడంలో తాను జాగ్రత్తగా ఉంటానని మలయాళ నటి పార్వతీ R కృష్ణ చెప్పారు. అయితే ఇటీవల బీచ్ ఫొటో షూట్‌లో పాల్గొన్న దృశ్యాలను కొందరు యూట్యూబర్లు అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన సమస్యపై ఇతరులు ఎందుకు స్పందించరో అర్థం కావట్లేదన్నారు. ఈమె ఏంజెల్స్, మాలిక్ తదితర చిత్రాల్లో నటించారు.

Similar News

News January 19, 2026

మాఘ మాసంలో పర్వదినాలు

image

చంద్ర దర్శనం(JAN 20), లలితా వ్రతం(21), వసంత పంచమి(23), రథసప్తమి(25), భీష్మాష్టమి(26), మధ్వనవమి(27), అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం(28), భీష్మ ఏకాదశి(29), వరాహ ద్వాదశి వ్రతం, పక్ష ప్రదోషం(30), విశ్వకర్మ జయంతి(31), మాఘ పౌర్ణమి, సతీదేవి జయంతి(FEB 1), సౌభాగ్య వ్రతం(2), సంకష్టహర చవితి(5), మంగళవ్రతం(9), విజయ ఏకాదశి(13), తిల ద్వాదశి, పక్ష ప్రదోషం(14), మహాశివరాత్రి(15), ధర్మ అమావాస్య(17).

News January 19, 2026

చెట్ల వ్యర్థాలను సెకన్లలో ముక్కలు చేసే ఉడ్ చిప్పర్..

image

కొబ్బరి, పామాయిల్, ఇతర పంటల్లో కింద పడిన కొమ్మలు, నరికిన చెట్ల కాండాన్ని వేరే చోటుకు తరలించడం కష్టంగా మారి తోటలోనే వదిలేస్తుంటారు. ఈ వ్యర్థాల నిర్వహణకు ‘ఉడ్ చిప్పర్’ యంత్రం పరిష్కారం చూపింది. కొబ్బరి, పామాయిల్ మట్టలను, చెట్ల కొమ్మలను ఇది సెకన్లలో ముక్కలుగా చేసేస్తుంది. ఈ ముక్కలను మల్చించ్, కంపోస్ట్ తయారీ, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. ఈ యంత్రానికి ఉండే చక్రాలతో ఇతర ప్రాంతాలకు సులభంగా తీసుకెళ్లవచ్చు.

News January 19, 2026

టెన్త్ అర్హతతో 572 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>RBI<<>>లో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ పాసైన వారు మాత్రమే FEB 4 వరకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో 36 పోస్టులు ఉన్నాయి. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కచ్చితంగా తమ స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, LPT ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.450, SC, ST, PwBDలకు రూ.50. వెబ్‌సైట్: rbi.org.in