News February 12, 2025

పెద్దపల్లి: వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

image

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును CBIకి అప్పగించేందుకు ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని పుట్ట మధు తరఫు న్యాయవాది కేసు కొట్టివేయాలని కోర్టును కోరారు. కోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది.

Similar News

News September 18, 2025

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్

image

అందరికీ విద్య, సౌకర్యాలు అందించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, మరమ్మతులు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుపై పంచాయతీరాజ్, విద్యా, మహిళా సంక్షేమ, డీఆర్డీఓ, గిరిజన, టీజీడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.

News September 18, 2025

ఆసిఫాబాద్: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నెహ్రూ నగర్‌కు చెందిన మాచర్ల రమేశ్ మొక్కజొన్న పంటను బుధవారం అడవి పందులు ధ్వంసం చేశాయి. కలత చెందిన రైతు అదే రోజు తన పంట చేనులోనే పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News September 18, 2025

VKB: దత్త పీఠాన్ని దర్శించుకున్న స్పీకర్

image

దత్తాత్రేయుడి కటాక్షంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం దుండిగల్‌లోని దత్త పీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక, దైవచింతన అలవర్చుకుంటే చక్కటి జీవితం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.