News February 12, 2025

జగిత్యాల జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్!

image

@యువత గుండె నిబ్బరంతో ఉండాలన్న ధర్మపురి సీఐ @వెల్గటూరులో పురుడు పోసిన 108 సిబ్బంది @వెల్గటూరులో ప్రకృతి వైపరీత్యాలపై విద్యార్థులకు NDRF అవగాహన @మెట్పల్లి వైన్స్‌లో బాటిల్ పై MRP కంటే రూ.30 అదనపు వసూళ్లు @మెట్పల్లి చెర్ల కొండాపూర్‌లో మొరం అక్రమ రవాణా.. స్థానికుల ఆరోపణలు @కొండగట్టులో మోకాళ్లపై వెళ్లి స్వామిని దర్శించుకున్న భక్తుడు

Similar News

News November 12, 2025

సివిల్స్ అభ్యర్థులకు త్వరలో రూ.లక్ష చొప్పున సాయం

image

TG: సివిల్స్ అభ్యర్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద లబ్ధి పొందిన వారిలో 43 మంది అభ్యర్థులు తాజాగా UPSC సివిల్స్ <<18265046>>ఫలితాల్లో<<>> ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. సింగరేణి CSR ప్రోగ్రామ్‌లో భాగంగా వీరికి CM రేవంత్ త్వరలో రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. అలాగే ఢిల్లీలో ఉచిత వసతి కల్పించడంతో పాటు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

News November 12, 2025

HYD: గాంధీ విగ్రహాల సేకరణ ప్రచార రథం ప్రారంభం

image

గాంధీభవన్‌లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాపన స్వర్ణోత్సవాల సందర్భంగా చేపట్టిన ‘ఒక అడుగు- లక్ష గాంధీజీ విగ్రహాలు’ కార్యక్రమానికి ప్రచార రథాన్ని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు పూనుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

News November 12, 2025

ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

image

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.