News March 20, 2024

ISROకి ప్రతిష్ఠాత్మక అవార్డు

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌‌ సాధించిన విజయాలకు ఏవియేషన్ వీక్ లారియేట్స్ అవార్డు వరించింది. ఇస్రో తరఫున అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో డిప్యూటీ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ ఈ అవార్డును అందుకున్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో అసాధారణ విజయాలను సాధించినందుకు ‘ఏవియేషన్ వీక్’ అవార్డులు అందిస్తుంది.

Similar News

News October 1, 2024

4 నెలల వయసులో చిన్నారికి పెళ్లి.. 20 ఏళ్లకు రద్దు

image

తన బాల్య వివాహానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఓ యువతి విజయం సాధించారు. 2004లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 4 నెలల చిన్నారి అనితకు పేరెంట్స్ పెళ్లి చేశారు. ఇప్పుడు కాపురానికి రావాలంటూ అత్తింటివారు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె 20 ఏళ్ల వయసులో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా, ఆ పెళ్లిని రద్దు చేసి, కోర్టు ఖర్చులను చెల్లించాలని అత్తమామలను ఆదేశించింది. బాల్య వివాహాలు దుర్మార్గం, నేరమని వ్యాఖ్యానించింది.

News October 1, 2024

మూసీ శుద్ధీకరణను అడ్డుకోవడం ఆ జిల్లాలకు మరణశాసనమే: కోమటిరెడ్డి

image

TG: మూసీ నది శుద్ధీకరణ అడ్డుకోవడమంటే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మరణశాసనం రాయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మూసీ విష రసాయనాలతో ఇప్పటికే ఇక్కడ పండే పంటలు, కాయగూరలను ఎవరూ కొనని పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుద్ధీకరణ కోసం ముందడుగు వేస్తుంటే రోజుకో కుట్రతో BRS రాజకీయం చేస్తుండటం అత్యంత దారుణం అని విమర్శించారు.

News October 1, 2024

తెలంగాణలో కొత్త మంత్రులు వీరేనా?

image

TG: దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(NLG), గడ్డం వినోద్(ADB), గడ్డం వివేకానంద్(ADB), ప్రేమ్‌సాగర్ రావు(ADB), బాలూనాయక్(NLG), రామచంద్రునాయక్(WGL), మల్‌రెడ్డి రంగారెడ్డి(RR), సుదర్శన్‌రెడ్డి(NZB), దానం నాగేందర్(HYD), వాకిటి శ్రీహరి(MBNR) ఉన్నారు. మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.