News February 12, 2025

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలి : కలెక్టర్

image

ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 87 ఎంపీటీసీ, 10 జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంపత్ రావు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 03, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News November 3, 2025

గంగవరం బీచ్‌లో యువకుడు గల్లంతు

image

గంగవరం సమీపంలోని మాధవస్వామి టెంపుల్ వద్ద యువకుడు కెరటాల తాకిడికి గల్లంతయ్యాడు. ఒడిశాకు చెందిన నలుగురు యువకులు, గంగవరం సమీపంలో బీచ్‌కు సందర్శనకు వెళ్ళగా మాధవస్వామి టెంపుల్ వద్ద రాళ్లపై నిలబడి రూపక్ సాయి అనే యువకుడు ఉండగా కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న న్యూపోర్ట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన యువకుడు‌ పెదగంట్యాడ మండలం సీతానగరంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.