News February 12, 2025

పోస్టుమార్టం నిర్వహణ పటిష్ఠంగా జరగాలి : వరంగల్ కలెక్టర్

image

వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం కేంద్ర నిర్వహణ పటిష్ఠంగా జరిగేలా దానికి తగిన అన్నిచర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శవ పరీక్షల నిర్వహణపై జరిగిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద దిశా నిర్దేశం చేశారు. శవాల పోస్టుమార్టం సకాలంలో జరగాలని, పోస్టుమార్టం చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 4, 2025

కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..

image

TG: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంలేని కుటుంబసభ్యులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఝరాసంగం మం. కక్కర్‌వాడలోని విఠల్ కూతురు, అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో విఠల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి రాధాకృష్ణ తండ్రిపై ఘోరంగా దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు.

News November 4, 2025

జూబ్లీహిల్స్‌లో HOME VOTING

image

జూబ్లీహిల్స్‌లో EC ఇంటి ఓటింగ్‌ను ప్రారంభించింది. వృద్ధులు, శారీరకంగా వికలాంగులైన ఓటర్లు ఇంటి ఓటింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 85 ఏళ్లు పైబడిన 84 మంది ఓటర్లు, 40 శాతం శారీరకంగా వికలాంగులైన 19 మంది ఓటెస్తారు. ఓటింగ్ సమయం ఉదయం 9 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉంటుంది. అధికారులు వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేయడానికి సహాయం చేస్తారు. నవంబర్ 6న కూడా వారు తమ ఇంటి నుంచే ఓటు వేయడానికి అనుమతిస్తారు.