News February 12, 2025
ఆధార్ అప్‌డేట్‌కు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టండి: కలెక్టర్

ఐదేళ్లకు పైబడిన పాఠశాల విద్యార్థులు, 15 ఏళ్లకు పైబడిన విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్ చేయించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆయన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఆధార్ నమోదు స్థితిగతులపై చర్చించారు.
Similar News
News January 11, 2026
50 పడకలతో మేడారం సమ్మక్క సారలమ్మ ఆసుపత్రి

మేడారం జాతరలో అత్యవసర వైద్య సేవల కోసం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకలతో కూడిన శ్రీ సమ్మక్క, సారలమ్మ పేరిట ప్రధాన ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే జంపన్న వాగు. ఇంగ్లిష్ మీడియం స్కూల్ వద్ద 6 పడకల సామర్థ్యంతో రెండు మినీ హాస్పిటళ్లు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు, వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చే 8 ప్రధాన రూట్లలో 42 ఎన్-రూట్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు.
News January 11, 2026
ఆదిలాబాద్: జర్వంతో బాలుడి మృతి

జర్వంతో బాలుడు(14) మృతిచెందిన ఘటన ఉట్నూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్థుల ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంటకు చెందిన భగవంత్‌రావ్-మరుబాయిల కుమారుడు మెంగురావ్ ASFలో పీవీటీజీలో 8వ తరగతి చదువుతున్నాడు. 4 రోజుల క్రితం జ్వరం రావడంతో ఉట్నూర్, అనంతరం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియాకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది.
News January 11, 2026
కుప్పం ఏరియాకు భారీ ప్రాజెక్ట్

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మానేంద్రం గ్రామంలో విమాన తయారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. HANSA-3(NG) రెండు సీట్ల ట్రైనర్ విమానాల తయారీ, ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటుకు 55.47 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. రూ.159 కోట్లతో రెండు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 250మందికి ఉపాధి లభించనుంది. ఏటా 108 విమానాల తయారీ చేయనున్నారు.


