News February 12, 2025
అంబారిపేటలో బైక్ దొంగతనం.. కేసు నమోదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739280314202_60417652-normal-WIFI.webp)
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలో శనిగారపు అశోక్ అనే వ్యక్తికి చెందిన బైకును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు మంగళవారం తెలిపారు. తాను బైకును తన పంట పొలం వద్ద పార్కింగ్ చేసి వెళ్లాడని, కొద్దిసేపటికి బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు చెప్పారు. అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలాన్ని ఎస్ఐ నవీన్ కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
అనంతపురంలో భర్త హత్య.. భార్య మరో ఇద్దరి అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325804979_727-normal-WIFI.webp)
కాశీ అనే వ్యక్తి హత్య కేసులో అతని భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల 2న అనంతపురం రూరల్ పరిధిలో కాశీని ఇద్దరితో కలిసి భార్యే హత్య చేసినట్టు వెల్లడైందన్నారు. నిందితులను ఆర్డీటీ స్టేడియం వద్ద అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు.
News February 12, 2025
శంషాబాద్ విమానాశ్రయానికి 6 పుష్పక్ బస్సులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739319504390_51765059-normal-WIFI.webp)
శంషాబాద్ విమానాశ్రయానికి మరిన్ని పుష్పక్ సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఈడీ రాజశేఖర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:55 గం.కు మొదటి బస్సు, రాత్రి 11:55 గంటలకు ఆఖరి బస్సు ఉంటుందన్నారు. నేటి నుంచి విమానాశ్రయం మీదుగా 6 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు మొదటి బస్సు, రాత్రి 11:50 గంటలకు చివరి బస్సు ఉంటుందన్నారు.
News February 12, 2025
తడ: శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద రోడ్డు ప్రమాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739326038848_673-normal-WIFI.webp)
తడ మండలం శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీలో వస్తున్న వ్యక్తి వేగంగా ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. 108 ద్వారా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.