News February 12, 2025

పెద్దపల్లి: ‘స్థానిక సంస్థల గత రిజర్వేషన్లు ఓసారి చూడండి’

image

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఓట్ల కంటే ముందే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రచారం సాగుతుంది. పెద్దపల్లి జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో UR-7, BC-3, SC-3 రిజర్వేషన్‌లు కేటాయించారు. అందులో మహిళా-7, జనరల్-6 స్థానాలు కేటాయించారు. జిల్లాలోని ఆశావాహులు వారి మండలానికి తమకు అనుకూలంగా జడ్పీటీసీ రిజర్వేషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 12, 2025

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు సమకూరింది.

News February 12, 2025

మంచిర్యాలలో యువతి అదృశ్యం

image

మంచిర్యాలలోని ఏసీసీ చెందిన 22 ఏళ్ల యువతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. తిరుపతి, సుమలత దంపతుల కుమార్తె(22) తరుచుగా ఫోన్‌లో మాట్లాడుతుంటే తల్లి మందలించింది. దీంతో ఈ నెల 4న ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News February 12, 2025

తిరుపతి: టెన్త్ అర్హతతో 99 ఉద్యోగాలు

image

టెన్త్ అర్హతతో తిరుపతి డివిజన్‌లో 59, గూడూరు డివిజన్‌లో 40 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

error: Content is protected !!