News February 12, 2025
ఫిబ్రవరి 12: చరిత్రలో ఈరోజు
1713: మొఘల్ చక్రవర్తి జహందర్ షా మరణం
1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
1809: అమెరికా 16 వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
1962: సినీ నటుడు జగపతిబాబు జననం
1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం
Similar News
News February 12, 2025
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు సమకూరింది.
News February 12, 2025
రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు
AP: రైతులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూములు రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని ‘ఆంధ్రప్రదేశ్ రాజముద్ర’ ఉన్న వాటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి అనగాని CM చంద్రబాబుకు తెలిపారు. అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు కూడా మార్చి నాటికి తొలగిస్తామన్నారు.
News February 12, 2025
బాగా ఆడినా జట్టు నుంచి తప్పించారు: రహానే
భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో సెంచరీ చేసినా తర్వాతి మ్యాచుల్లో జట్టులోకి తీసుకోలేదని అన్నారు. శతకం నమోదు చేసినా జట్టు నుంచి తప్పించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని రహానేను జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అనుభవం ఉన్న ఆటగాడు ఉంటే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు మేలు జరగుతుందని అంటున్నారు.