News March 20, 2024
నేను మా ఆయన భార్యను!

దేశంలో తొలి లోక్‌సభ ఎన్నికల్లో అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేరు చెప్పలేదు. ఫలానా వ్యక్తి భార్యననో, ఫలానా వ్యక్తి కూతురుననో అని చెప్పారు. అప్పటి ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఆ మహిళలు అలా ప్రవర్తించారు. ఈ సమస్య ఎక్కువగా బిహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎదురైంది. కాగా సరైన పేర్లు చెప్పని 28 లక్షల ఓటర్లను అధికారులు తొలగించారు.
Similar News
News April 2, 2025
కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక కోరిన కేంద్రం

TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై వాస్తవిక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అటవీ చట్టానికి లోబడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని పేర్కొంది.
News April 2, 2025
ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయొచ్చుగా..!

భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసరమై మండుటెండలో బయటకు వస్తే సిగ్నల్స్ వద్ద ఉడికిపోవాల్సి వస్తోంది. ఈక్రమంలో వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ఒడిశాలోని భువనేశ్వర్ మున్సిపల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ క్లాత్‌తో తాత్కాలిక టెంట్ ఏర్పాటు చేశారు. ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
News April 2, 2025
2.O భిన్నంగా ఉంటుంది: జగన్

AP: వచ్చే ఎన్నికల్లో YCP భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. కరోనా వల్ల కార్యకర్తలకు నేను చేయాల్సినంత చేసుండకపోవచ్చు. ఈసారి జగన్ 2.O భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతా. రాబోయే రోజులు మనవే’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అప్పులపై CBN అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.