News February 12, 2025

కొనరావుపేట్: ఖాళీ సిలిండర్ల దొంగ అరెస్ట్..

image

దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కోనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మండలంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కొనరావుపేటకు చెందిన ముడారి పోశెట్టి ట్రాలీ ఆటోలో నుంచి నిమ్మపల్లి గ్రామానికి చెందిన మోహన్ నాయక్ (38) 2 ఖాళీ సిలిండర్లను ఎత్తుకొని పారిపోయాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Similar News

News February 12, 2025

నిజామాబాద్‌లో ఫొటో జర్నలిస్టు మృతి

image

నిజామాబాద్‌లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు. 

News February 12, 2025

మార్చిలో మెగా DSC నోటిఫికేషన్

image

AP: 16,247 పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, త్వరలో టీచర్ల బదిలీల చట్టం తేనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని వర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని చెప్పారు.

News February 12, 2025

నెక్కొండలో అత్యధికం.. నర్సంపేటలో అత్యల్పం

image

వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీ, 11 జీడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం నెక్కొండ మండలంలో 81 పోలింగ్ కేంద్రాలు, రాయపర్తిలో 78, పర్వతగిరి-68, సంగెం-66, దుగ్గొండి-65, చెన్నారావుపేట-55, నల్లబెల్లి-53, గీసుకొండ-48, ఖానాపురం-48, వర్ధన్నపేట-47, నర్సంపేట మండలంలో 36 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.

error: Content is protected !!