News February 12, 2025

రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో ఆయన భారత సైన్యాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సరిహద్దు రోడ్ల సంస్థ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ కేసు పెట్టారు. ఆ కేసు విచారణను స్వీకరించిన కోర్టు, వచ్చే నెల ఆఖరి వారంలో విచారణకు హాజరుకావాలని రాహుల్‌ని ఆదేశించింది.

Similar News

News February 12, 2025

రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు

image

AP: రైతులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూములు రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని ‘ఆంధ్రప్రదేశ్ రాజముద్ర’ ఉన్న వాటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి అనగాని CM చంద్రబాబుకు తెలిపారు. అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు కూడా మార్చి నాటికి తొలగిస్తామన్నారు.

News February 12, 2025

బాగా ఆడినా జట్టు నుంచి తప్పించారు: రహానే

image

భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో సెంచరీ చేసినా తర్వాతి మ్యాచుల్లో జట్టులోకి తీసుకోలేదని అన్నారు. శతకం నమోదు చేసినా జట్టు నుంచి తప్పించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని రహానేను జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అనుభవం ఉన్న ఆటగాడు ఉంటే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌‌కు మేలు జరగుతుందని అంటున్నారు.

News February 12, 2025

ఇజ్రాయెల్ vs హమాస్.. మళ్లీ యుద్ధం తప్పదా?

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ శనివారం మధ్యాహ్నం లోపు తమ దేశ బందీలను విడిచిపెట్టకపోతే గాజాపై సైనిక చర్యకు దిగుతామని, సీజ్‌ఫైర్ డీల్ ముగుస్తుందని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. హమాస్ అంతు చూసే వరకు నిద్రపోమని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇదే మాట చెప్పారు. అయితే ట్రంప్ ఒప్పందాలను గౌరవించాలని, ఆయన హెచ్చరికలను తాము పట్టించుకోమని హమాస్ తేల్చి చెప్పింది.

error: Content is protected !!