News March 20, 2024
తాగునీటి ఇబ్బందులు ఎదురుకావొద్దు : కలెక్టర్

జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన ఎంపీడీఓలు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్షించారు. జలాశయాల్లో నీటిమట్టం పడిపోతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని చెప్పారు. బోర్ల మరమ్మతు, ఫ్లషింగ్ చేయించడమే కాక ప్రైవేట్ బావులు, బోర్లను లీజ్కు తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 3, 2026
రెండు గంజాయి కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష

ఖమ్మం: రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నిందితుడికి ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.ఉమాదేవి తీర్పు చెప్పారు. పెనుబల్లి మండలానికి చెందిన వ్యాపారి బోయిన వెంకటరమణ (62) పై 2024, 2025లో వియం బంజర పోలీసుల తనిఖీలలో గంజాయితో పట్టుబడ్డాడు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.
News March 3, 2026
వెలుగుమట్ల పార్కును సందర్శించిన డీఎఫ్ఓ

ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ పరిశీలించారు. బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడవుల రక్షణకు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
News March 3, 2026
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఖమ్మం కలెక్టర్

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ సదస్సులో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని సీఎం సూచించారు. ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానించాలని, మధ్యాహ్న భోజన బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనుల వేగవంతంపై చర్చించారు.


