News February 12, 2025

అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తాం: భట్టి

image

TG: రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ <<15416781>>డిమాండ్<<>> పెరుగుతున్న నేపథ్యంలో TGSPDCL అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం నిర్వహించారు. వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై చర్చించారు. రానున్న రోజుల్లో డిమాండ్ ఎంత పెరిగినా రెప్పపాటు అంతరాయం లేకుండా అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా 1912 టోల్ ప్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 12, 2025

బర్డ్ ఫ్లూ భయం.. రూ.150కే కేజీ చికెన్

image

ఏపీలో బర్డ్ ఫ్లూతో లక్షలాది సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ప్రారంభమైంది. ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సాధారణంగా రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్ముడవుతుంది. కానీ ఇప్పుడు 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. దీంతో కేజీ చికెన్ రేటు రూ.150కి పడిపోయింది. ఏపీలోని తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు చనిపోతున్నాయి.

News February 12, 2025

Stock Markets: కుప్పకూలాయి..

image

స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,862 (-209), సెన్సెక్స్ 75,570 (-730) వద్ద ట్రేడవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావంతో గ్లోబల్ సప్లయి చైన్ దెబ్బతింటుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్ముతున్నారు. ఇండియా విక్స్ 2.75% పెరిగి 15.28కి చేరుకుంది. IT షేర్లు రాణిస్తున్నాయి. మీడియా, రియాల్టి, బ్యాంకు, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి.

News February 12, 2025

దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు

image

TG: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం రూ.50కి మించి వసూలు చేయొద్దని మీసేవ సెంటర్లను ప్రభుత్వం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.50కి బదులు ఏకంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అధికంగానే దండుకుంటున్నారు. ఈ దోపిడీపై అధికారులు ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎంత తీసుకుంటున్నారు? కామెంట్ చేయండి.

error: Content is protected !!