News February 12, 2025

నన్ను రాజకీయాల్లోకి లాగకండి: విశ్వక్

image

తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్‌సేన్ నెటిజన్లను కోరారు. తాను మిడిల్ ఫింగర్ చూపిస్తున్న పోస్టర్‌ నెల రోజుల క్రితం విడుదలైందని, రెడ్ సూట్ ఫొటో కూడా ఇప్పటిది కాదని చెప్పారు. ‘ప్రతీసారి తగ్గను. కానీ నిన్న మనస్ఫూర్తిగా <<15423495>>సారీ<<>> చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. శాంతంగా ఉండండి. అసభ్య పదజాలం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైలాను బాయ్‌కాట్ చేయాలన్న ఆలోచనను బాయ్‌కాట్ చేయండి’ అని X పోస్ట్ పెట్టారు.

Similar News

News February 12, 2025

నేటి నుంచి ఆధ్యాత్మిక పర్యటన.. బేగంపేట్ చేరుకున్న పవన్

image

AP Dy.CM పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆధ్యాత్మిక పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి కిందట HYDలోని బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన 4రోజులపాటు కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. అనంత పద్మనాభ స్వామి, మధురై మీనాక్షి, పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, తదితర ఆలయాలను సందర్శించనున్నారు. ఇటీవల జ్వరం బారిన పడిన పవన్ కోలుకొని ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్తున్నారు.

News February 12, 2025

టాయిలెట్‌లోకి ఫోన్ తీసుకెళ్తే..

image

టాయిలెట్లలో ఫోన్ వాడటం శారీరకంగా, మానసికంగా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల విసర్జన అవయవాలపై ఒత్తిడి పడుతుందని, రక్త ప్రసరణ నెమ్మదిస్తుందని తెలిపారు. రక్తనాళాలు ఉబ్బి పైల్స్, ఫిషర్స్‌కు దారి తీస్తుంది. టాయిలెట్‌లోని ప్రమాదకర బ్యాక్టీరియాలు, క్రిములు స్క్రీన్‌పై చేరి అతిసారం, కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు వస్తాయి.
Share it

News February 12, 2025

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు సమకూరింది.

error: Content is protected !!