News February 12, 2025

మంచి మాట – పద్యబాట

image

లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!

భావం: శారీరకంగా బలంగా ఉన్నవాడికంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా మచ్చిక చేసుకుని దానిమీదకు ఎక్కగలడు.

Similar News

News February 12, 2025

అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు కన్నుమూత

image

అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. స్ట్రోక్ రావడంతో ఆదివారం లక్నోలోని ఆస్పత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. సత్యేంద్ర దాస్ డయాబెటిస్, హై బీపీతోనూ బాధపడుతున్నారు. 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ముందు నుంచే ఈయన రామమందిర అర్చకుడిగా ఉన్నారు.

News February 12, 2025

బుమ్రా లేకుండా భారత్ కప్పు కొడుతుందా?

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూరం కావడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. జట్టుకు బుమ్రా చాలా ముఖ్యమని, అతడు లేకుంటే బౌలింగ్ దళం బలహీనంగా మారుతుందని చెబుతున్నారు. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, 2023 WTC ఫైనల్‌కు బుమ్రా దూరమయ్యారని.. ఫలితంగా భారత్ ఆ కప్పులను కోల్పోయిందని గుర్తు చేస్తున్నారు. మరి ఈసారి బుమ్రా లేకుండా భారత్ ఈ ఐసీసీ ట్రోఫీని ముద్దాడుతుందా? కామెంట్ చేయండి.

News February 12, 2025

మార్చిలో మెగా DSC నోటిఫికేషన్

image

AP: 16,247 పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, త్వరలో టీచర్ల బదిలీల చట్టం తేనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని వర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని చెప్పారు.

error: Content is protected !!