News February 12, 2025

NRPT: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రిసైడింగ్, ఓ పి ఓ లను నియమించారు. త్వరలో వీటికి మాస్టర్ ట్రైనర్ ల తో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 12, 2025

అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు కన్నుమూత

image

అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. స్ట్రోక్ రావడంతో ఆదివారం లక్నోలోని ఆస్పత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. సత్యేంద్ర దాస్ డయాబెటిస్, హై బీపీతోనూ బాధపడుతున్నారు. 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ముందు నుంచే ఈయన రామమందిర అర్చకుడిగా ఉన్నారు.

News February 12, 2025

కృష్ణా: RTC బస్సులో తండేల్ సినిమా.. కొనకళ్ల స్పందన

image

ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ స్పందించారు. 9వ తేదీన పలాస నుంచి విజయవాడ వస్తున్న బస్సులో సినిమా ప్రదర్శించినట్లు కంప్లైంట్ వచ్చిందని ఆయన చెప్పారు. అలా ప్రదర్శించడం అనేది తప్పని ఆయన ఖండించారు. దీనిపై ఎంక్వయిరీ జరుగుతుందని తెలిపారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

News February 12, 2025

NGKL: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.

error: Content is protected !!