News February 12, 2025
NRPT: మన్యంకొండ జాతరకు ప్రత్యేక బస్ సర్వీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739276188253_51550452-normal-WIFI.webp)
మన్యంకొండ జాతర సందర్భంగా నారాయణపేట బస్ డిపో నుండి ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఎల్లుండి (బుధవారం, గురువారం) రెండు రోజుల పాటు భక్తుల సౌకర్యం కొరకు బస్ సర్వీసులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్ సర్వీసులను పట్టణం తోపాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News February 12, 2025
ఆమె నోరు తెరిచిందంటే మగాళ్లపై బూతులే: FIR నమోదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739339591769_1199-normal-WIFI.webp)
‘ఇండియా గాట్ లాటెంట్’ షో జడ్జి, ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వా మఖీజాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ సహా కొన్ని షోల్లో యథేచ్ఛగా బూతులు మాట్లాడటంపై FIR ఫైల్ చేశారు. మొన్న పేరెంట్స్ సెక్స్‌పై వల్గర్‌గా మాట్లాడిన యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, సమయ్ రైనాపై కేసు బుక్కైంది. ఇందులో పాల్గొన్న యువతి అపూర్వను పట్టించుకోలేదు. దీంతో మగాళ్లు మాత్రమే శిక్షకు అర్హులా, అమ్మాయిలు కాదా అని విమర్శలు వచ్చాయి.
News February 12, 2025
మెదక్: అప్పులతోనే ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739337189847_50139766-normal-WIFI.webp)
మెదక్ పట్టణంలో ప్రముఖ వ్యాపారి మల్లికార్జున రమేష్ (54) మంగళవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రమేశ్ పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఈ సూపర్ మార్కెట్ ద్వారా 100 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారంలో అప్పులు రూ.కోట్లలో పేరుకుపోయాయి. వాటిని తీర్చే మార్గం లేక ఇంటిపై గల పెంట్ హౌస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
News February 12, 2025
భద్రాద్రి: నిధులు దుర్వినియోగం.. ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739339614669_718-normal-WIFI.webp)
భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో రూ.23,89,750 ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై భద్రాచలం జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అప్పటి పంచాయతీ కార్యదర్శి బత్తిన శ్రీనివాస రావు, సర్పంచ్ ధరావత్ చందునాయక్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని బూర్గంపాడు SI రాజేశ్ తెలిపారు.