News February 12, 2025
నేడే మూడో ODI.. జట్టులోకి పంత్, అర్ష్‌దీప్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739303893660_893-normal-WIFI.webp)
ఇండియా, ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ మూడో వన్డే జరగనుంది. IND తుది జట్టులోకి రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్‌దీప్ వచ్చే అవకాశముంది. ఈ పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు కఠినంగా, బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, డ్యూ కూడా వచ్చే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. sports 18-2, హాట్‌స్టార్‌లో మ.1.30 నుంచి లైవ్ చూడవచ్చు. WAY2NEWSలో లైవ్ స్కోర్ అప్‌డేట్స్ పొందవచ్చు.
Similar News
News February 12, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738283032838_893-normal-WIFI.webp)
TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు శాటిలైట్ సేవలు, AIని వినియోగించనుంది. దీంతో నిర్మాణ స్థల అక్షాంశ, రేఖాంశ సంఖ్యలను ఖరారు చేసి శాటిలైట్‌కు అనుసంధానం చేస్తారు. ఈ నిర్మాణాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిశీలించే అవకాశం ఉంది. నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేశాకే అర్హులకు బిల్లులు అందనున్నాయి.
News February 12, 2025
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు కన్నుమూత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739333628974_367-normal-WIFI.webp)
అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. స్ట్రోక్ రావడంతో ఆదివారం లక్నోలోని ఆస్పత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. సత్యేంద్ర దాస్ డయాబెటిస్, హై బీపీతోనూ బాధపడుతున్నారు. 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ముందు నుంచే ఈయన రామమందిర అర్చకుడిగా ఉన్నారు.
News February 12, 2025
బుమ్రా లేకుండా భారత్ కప్పు కొడుతుందా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739330521778_367-normal-WIFI.webp)
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూరం కావడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. జట్టుకు బుమ్రా చాలా ముఖ్యమని, అతడు లేకుంటే బౌలింగ్ దళం బలహీనంగా మారుతుందని చెబుతున్నారు. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, 2023 WTC ఫైనల్‌కు బుమ్రా దూరమయ్యారని.. ఫలితంగా భారత్ ఆ కప్పులను కోల్పోయిందని గుర్తు చేస్తున్నారు. మరి ఈసారి బుమ్రా లేకుండా భారత్ ఈ ఐసీసీ ట్రోఫీని ముద్దాడుతుందా? కామెంట్ చేయండి.