News February 12, 2025
జనగామ: మున్సిపాలిటీ వార్డు అధికారులతో కలెక్టర్ సమీక్షా

జనగామ మున్సిపాలిటీ వార్డు అధికారులతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని టాక్సీ వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, ప్లాంటేషన్ తదితర విషయాలపై చర్చించారు. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్‌లపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటి పరిధిలో రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
Similar News
News October 31, 2025
కాసిపేట: అన్ని సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

కాసిపేట మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. ల్యాబ్, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి విద్యా బోధన చేయాలన్నారు.
News October 31, 2025
అమలాపురం: నవంబర్ 4న జాబ్ మేళా

నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా ఐటీ రంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. వికాస ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నవంబర్ 4వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో వికాస ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా జరుగుతుందని, ఐటీ రంగ యువత దీనిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
News October 31, 2025
GWL: సమగ్రత కోసం పోరాడిన ఉక్కు మనిషి పటేల్: ఎస్పీ

దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశాడని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలన అనంతరం స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూభాగాన్ని ఏకం చేసి దేశ రక్షణ, సమగ్రత కోసం పాటుపడ్డాడన్నారు. తొలి హోం శాఖ మంత్రిగా పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేశాడన్నారు.


