News February 12, 2025
త్వరలో గూగుల్ మెసేజెస్ యాప్ నుంచే వాట్సాప్ కాల్స్!
గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి నేరుగా WhatsApp వీడియో కాల్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా Google meet వీడియో కాల్స్ మాత్రమే చేసుకునేందుకు వీలుంది. అయితే యాప్స్‌ను స్విచ్ చేసుకునే బదులు, యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ తీసుకొస్తోంది. తొలుత వన్ ఆన్ వన్ కాల్స్‌కు మాత్రమే ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ అయి ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుంది.
Similar News
News February 12, 2025
NLG: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు కీలక సూచన
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ మీసేవా కేంద్రాల్లో చేసుకోవాల్సిన అవసరం లేదని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులను కలెక్టరేట్ నుంచి వచ్చిన ప్రొఫార్మా ప్రకారం ఆన్‌లైన్ చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కొత్త వారు, ఇంతకు ముందు దరఖాస్తు చేయని వారు మాత్రమే చేసుకోవాలన్నారు.
News February 12, 2025
బుమ్రా లేకుండా భారత్ కప్పు కొడుతుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూరం కావడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. జట్టుకు బుమ్రా చాలా ముఖ్యమని, అతడు లేకుంటే బౌలింగ్ దళం బలహీనంగా మారుతుందని చెబుతున్నారు. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, 2023 WTC ఫైనల్‌కు బుమ్రా దూరమయ్యారని.. ఫలితంగా భారత్ ఆ కప్పులను కోల్పోయిందని గుర్తు చేస్తున్నారు. మరి ఈసారి బుమ్రా లేకుండా భారత్ ఈ ఐసీసీ ట్రోఫీని ముద్దాడుతుందా? కామెంట్ చేయండి.
News February 12, 2025
మార్చిలో మెగా DSC నోటిఫికేషన్
AP: 16,247 పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, త్వరలో టీచర్ల బదిలీల చట్టం తేనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని వర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని చెప్పారు.