News February 12, 2025

ములుగు: పోస్టల్లో ఉద్యోగ అవకాశాలు

image

ఇండియన్ పోస్ట్ 21,413 జీడీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ డివిజన్ పరిధిలో 29 ఖాళీలున్నాయి. దీనికి పదవ తరగతి అర్హులు కాగా.. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారం రిక్రూట్‌మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్ వారికి రూ.100 కాగా మిగితా వారికి ఉచితం. మార్చి 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News July 7, 2025

ఒంగోలు నుంచి వెళ్తుండగా ఉద్యోగి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం చనిపోయారు. ఒంగోలు నుంచి బైకుపై వెళ్తున్న వ్యక్తి జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై చనిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేదా అదుపుతప్పి ఆయనే కింద పడిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మృతుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ అని సమాచారం. ఒంగోలు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

News July 7, 2025

NLG: ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడే ఆఖరు

image

ఎస్సీ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికిగాను సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి. శశికళ తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన SC, ST, BC (BCE, PWD) కులాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు www.tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 7లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 13న రాత పరీక్ష ఉంటుందన్నారు.

News July 7, 2025

నిజాంపేట్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

నిజాంపేట్ మండలానికి చెందిన గంగరబోయిన అంజమ్మ(45) ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిజాంపేట్ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా అల్లాదుర్గ్ శివారులో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు ఆమెను జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.