News February 12, 2025

మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గింది: కేంద్రం

image

గత ఆరేళ్లలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 38కి తగ్గిందని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. నేషనల్ పాలసీ&యాక్షన్ ప్లాన్-2015 అమలు చేసినప్పటి నుంచి LWE ప్రభావిత ప్రాంతాల్లో 4,000kmsకి పైగా రోడ్లు నిర్మించామని తెలిపింది. కనెక్టివిటీని మెరుగుపరచడానికి 1,300కి పైగా టెలికాం టవర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో LWE ప్రభావిత రాష్ట్రాలకు ₹1,925.83crs విడుదల చేశామని వివరించింది.

Similar News

News February 12, 2025

42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: ఆర్ కృష్ణయ్య

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

News February 12, 2025

ప్రధానికి బెదిరింపు కాల్

image

PM మోదీ టార్గెట్‌గా బెదిరింపు కాల్ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారమివ్వడంతో కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా గుర్తించారు. మోదీ పర్యటనకు ముందే ఈ కాల్ వచ్చినట్లు తెలిపారు.

News February 12, 2025

‘లైలా’ రన్ టైమ్ ఎంతంటే?

image

‘లైలా’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ ఎండింగ్ కార్డ్స్‌తో కలుపుకొని 2 గంటల 16 నిమిషాలు ఉన్నట్లు మూవీ వర్గాలు పేర్కొన్నాయి. విశ్వక్ సేన్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎల్లుండి థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల కమెడియన్ <<15413032>>పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో<<>> ఈ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

error: Content is protected !!