News February 12, 2025
గండేపల్లి: బంగారు గొలుసు అపహరించిన వ్యక్తి అరెస్ట్

గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మాయి వేషధారణలో మరో వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు విలువ చేసే బంగారు గొలుసు అపహరించాడు. దీనిపై గండేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఆ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారని జగ్గంపేట సీఐ వైఆర్‌కె తెలిపారు.
Similar News
News November 3, 2025
ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

AP: తిరుపతిలోని SV యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సైకాలజీ డిపార్ట్మెంట్లో జూనియర్ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సైకాలజీ డిపార్ట్మెంట్ HOD విశ్వనాథ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ‘ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు’ అని అన్నారని, విశ్వనాథ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
News November 3, 2025
చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా ఉండాలి: మంత్రి వాకిటి

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 122 కోట్ల వ్యయంతో 83 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను 26 వేల నీటి వనరుల్లో నవంబర్ 20లోపు విడుదల చేయాలని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో ఈ నెల 6 నుంచి చేప పిల్లల పంపిణీ ప్రారంభమవుతుందని కలెక్టర్ సత్య శారద తెలియజేశారు.
News November 3, 2025
సికింద్రాబాద్: ఉజ్జయిని మహకాంళిని దర్శించుకున్న కలెక్టర్

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని డీసీపీ రష్మిక పెరుమాళ్, జిల్లా కలెక్టర్ హరిచందన దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు కలెక్టర్‌కి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద దీపాలంకరణ కార్యక్రమంలో మహిళా భక్తులతో కలిసి దీపాలను వెలిగించారు.


