News February 12, 2025

చిత్తూరు: టెన్త్ అర్హతతో 54 ఉద్యోగాలు

image

టెన్త్ అర్హతతో చిత్తూరు డివిజన్‌లో 54 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News February 12, 2025

బైరెడ్డిపల్లి: మహిళపై అత్యాచారయత్నం

image

బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

News February 11, 2025

చిత్తూరు జిల్లా హెడ్‌లైన్స్

image

✒నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!
✒ పుంగనూరులో యువకుడి సూసైడ్
✒టీడీపీ ఎంపీలపై మిధున్ రెడ్డి ఫైర్
✒ 158 ఏళ్ల చరిత్ర కలిగిన మసెమ్మ జాతరరేపే ప్రారంభం
✒శ్రీవారి సేవలో సినీ నటుడు కార్తీ
✒SPMVV: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
✒పెద్దిరెడ్డి ఓ దొంగ: MP శబరి

News February 11, 2025

నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!

image

టీడీపీ నేత, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సోదరుడు గాలి జగదీశ్ వైసీపీలో చేరికకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు వైసీపీలో చేరేందుకు మాజీ సీఎం జగన్‌తో వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. గాలి జగదీశ్ చేరికకు మాజీ మంత్రి రోజా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగదీశ్ నగరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

error: Content is protected !!