News February 12, 2025

ప్రకాశం: టెన్త్ అర్హతతో 118 ఉద్యోగాలు

image

మార్కాపురం డివిజన్‌‌లో 57, ప్రకాశం డివిజన్‌లో 61 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News April 24, 2025

అర్థవీడులో పులి సంచారం

image

అర్ధవీడు మండల పరిసర ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం నిజమేనని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం మొహిద్దిన్ పురం సమీపంలో రోడ్డుపై పెద్దపులి కనిపించగా స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి అధికారులు తనిఖీలు చేశారు. స్థానికంగా కనిపించిన గుర్తుల ఆధారంగా ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లుగా డీఆర్వో ప్రసాద్ రెడ్డి బుధవారం నిర్ధారించారు.

News April 23, 2025

ఒంగోలులో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

image

ఉగ్ర దాడిని నిరసిస్తూ ఒంగోలులో వైసీపీ క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మార్కెట్ కాంప్లెక్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

News April 23, 2025

వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

image

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.

error: Content is protected !!