News February 12, 2025

‘లైలా’కు నందమూరి అభిమానుల మద్దతు

image

నటుడు పృథ్వీ వ్యాఖ్యలతో <<15413032>>బాయ్‌కాట్ లైలా<<>> అంటూ వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హీరో విశ్వక్‌ వివరణ ఇచ్చుకున్నప్పటికీ వారు వెనక్కితగ్గలేదు. ఈక్రమంలో ఆయనకు మద్దతుగా నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్‌కాట్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.

Similar News

News February 12, 2025

‘లైలా’ రన్ టైమ్ ఎంతంటే?

image

‘లైలా’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ ఎండింగ్ కార్డ్స్‌తో కలుపుకొని 2 గంటల 16 నిమిషాలు ఉన్నట్లు మూవీ వర్గాలు పేర్కొన్నాయి. విశ్వక్ సేన్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎల్లుండి థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల కమెడియన్ <<15413032>>పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో<<>> ఈ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

News February 12, 2025

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు.. ఇవి తీసుకెళ్లండి!

image

TG: కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసే వారు మీసేవ సెంటర్లకు తమ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇదివరకే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.50. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

News February 12, 2025

వాట్సాప్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తూ మరిన్ని కొత్తసేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాకినాడలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు, దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇవ్వనుంది. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం వంటి క్షేత్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

error: Content is protected !!