News February 12, 2025

సిద్దిపేట: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 12, 2025

NZB: విచారణ కోసం తీసుకెళ్లారు.. వ్యక్తి సూసైడ్ అటెంప్ట్

image

విచారణ నిమిత్తం తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన NZBలో కలకలం రేపింది. గూపన్పల్లిలో ఓ డాక్టర్ షెడ్‌లో పని చేస్తున్న బోధన్ మండలం కల్దుర్కికి చెందిన రాజును ముగ్గురు వ్యక్తులు వచ్చి ఓ చోరీ కేసు విషయంలో విచారణ కోసం తీసుకెళ్లినట్లు అతడి భార్య లక్ష్మి తెలిపారు. కాగా అనంతరం అతడు గడ్డి మందు తాగడని, దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 12, 2025

జేఈఈ మెయిన్‌లో బాన్సువాడ విద్యార్థి ప్రతిభ 

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో 99.84 శాతం సాధించి అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థికి కాలనీవాసులు అభినందనలు తెలిపారు. అభినయ్ మాట్లాడుతూ.. ఈ ప్రతిభ కనబర్చడానికి చాలా కష్టపడ్డానన్నారు.

News February 12, 2025

అక్రమం ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ సీపీ

image

ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు సన్నద్ధమాయ్యారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ శివారులోని ఇసుక ర్యాంపులను పరిశీలించారు.

error: Content is protected !!