News February 12, 2025

NGKL: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.

Similar News

News February 12, 2025

ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్

image

ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. డబ్బు, ఆహారం రావడంతో ఏ పని చేయడానికీ ఇష్టపడట్లేదని పేర్కొంది. పనిచేయకుండానే డబ్బులు వస్తుండటంతో ఇలా జరుగుతుందని తెలిపింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

News February 12, 2025

సంగారెడ్డి: త్వరలో హరీశ్ రావు పాదయాత్ర

image

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌తో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు భూసేకరణ దశలో నిలిచిపోయాయని, తిరిగి పనులు ప్రారంభించాలని పాదయాత్ర చేపడతామన్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో హరీశ్ రావు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

News February 12, 2025

HYD: కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది: కునంనేని

image

కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ముగ్ధూం భవన్‌లో ఆయన మాట్లాడుతూ..‘కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది. ప్రజా ప్రతినిధులు ఫోన్‌లు ఎత్తడం లేదు. సిస్టం ఫాలో అవడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసొస్తే పోటీ చేస్తాం. లేకపోతే బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం’ అన్నారు.

error: Content is protected !!