News February 12, 2025

కరీంనగర్: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

కరీంనగర్ డివిజన్‌లో 50 జీడీఎస్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ జ్ఞానం ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News February 12, 2025

బాపట్ల: ఈ పాప మీకు తెలుసా.!

image

బాపట్ల జిల్లా మహిళాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రావణి అనే పాప ఈనెల 5వ తేదీ నుంచి ఆశ్రయం పొందుతుందని, పాప తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ తగు ఆధారాలు చూపించి పాపను తీసుకువెళ్లాలని బాపట్ల జిల్లా శిశు సంక్షేమ అధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 30 రోజులలోపు పాపను తీసుకెళ్లని ఎడల ప్రభుత్వ అదేశాల ప్రకారం అనాథగా ప్రకటించి దత్తత ఇస్తామని తెలిపారు.

News February 12, 2025

అందుకే ఓడిపోయాం: YS జగన్

image

AP: గత ఎన్నికల్లో తాము అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయామని వైఎస్ జగన్ కార్యకర్తలతో అన్నారు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ సర్కార్ పరిస్థితేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. రాబోయేది జగన్ 2.0 పాలన అని, 25-30 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని వదలబోనని హెచ్చరించారు.

News February 12, 2025

Stock Markets: షార్ప్ రికవరీతో హ్యాపీ.. హ్యాపీ..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లలో షార్ప్ రికవరీ జరిగింది. బెంచ్‌మార్క్ సూచీలు రోజువారీ కనిష్ఠాల నుంచి బలంగా పుంజుకున్నాయి. ఆరంభంలో 200Pts నష్టపోయిన నిఫ్టీ ప్రస్తుతం 34 pts లాభంతో 23,108 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ -600 నుంచి +89కి చేరుకొని 76,377 వద్ద చలిస్తోంది. ఫైనాన్స్, మెటల్, బ్యాంకు, మీడియా రంగాలు ఇందుకు దన్నుగా నిలిచాయి. SBILIFE, BAJAJFINSV, HDFCLIFE, ULTRACEMCO, ADANIENT టాప్ గెయినర్స్.

error: Content is protected !!