News February 12, 2025
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ సుహాసిని

బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోళ్లు మృతిచెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుహాసిని అన్నారు. చికెన్, గుడ్లు తినకుండా ఉండాలని, కోళ్ల ఫారాల నిర్వాహకులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యం శానిటైజర్‌లతో చేతులను శుభ్ర పరుచుకోవాలన్నారు. మాస్క్ ధరించిన తరువాత ఫారాల్లో పనులు చేయాలని సూచించారు.
Similar News
News September 17, 2025
నిర్మల్: ఆకాశం ఎందుకో ఎర్రబడ్డది..!

సూర్యాస్తమయ సమయంలో ప్రకృతి సంతరించుకునే రంగులు ముచ్చట గొలుపుతాయి.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. బుధవారం సంధ్య వేళ సూర్యుడు అస్తమిస్తుండగా ఏర్పడిన అరుణవర్ణం చూపరులకు ఆహ్లాదం పంచింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి ప్రధాన రోడ్డు పక్కన నుంచి వెళ్తుండగా టెంబుర్ని పెద్ద చెరువు మీదుగా కనిపించిన ఈ దృశ్యం చూసే వారికి ఆహ్లాదం పంచింది.
News September 17, 2025
నిజాంసాగర్: మంజీర నదిలో వ్యక్తి గల్లంతు

నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ సమీపంలోని నాగమడుగు వద్ద మంజీర నదిలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. బంజపల్లికి చెందిన వడ్ల రవి(42) నాగమడుగు ప్రాంతంలో కాలకృత్యాల కోసం వెళ్లాడు. అయితే, వరద నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
News September 17, 2025
హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్‌కౌంటర్

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. UPలోని ఘజియాబాద్‌లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.