News February 12, 2025

HYD: అలా చేస్తే క్యాన్సర్ వ్యాధికి చెక్ పడినట్లే..!

image

జీవనశైలి మార్చుకుంటే 30% క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చని HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రి డాక్టర్ సదాశివుడు తెలిపారు. రోజూ వ్యాయామం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలని, మహిళలు ఏడాదికి ఒకసారి మమ్మోగ్రఫీ, పాప్‌స్మియర్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్ సూచించారు. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు.

Similar News

News February 12, 2025

వాట్సాప్‌ ద్వారా సింహాచలం దర్శనం టికెట్స్

image

సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం టికెట్స్, ఆర్జిత సేవ టికెట్స్ ఆన్‌లైన్ ద్వారానే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా లభ్యమవుతున్నాయని ఈవో త్రినాథ్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9552300009 నంబర్‌కు వాట్సాప్ చేసి టికెట్స్ బుకింగ్ చేసుకొనవచ్చు అన్నారు. అలా బుకింగ్ చేసుకున్న టికెట్స్ కాపీను తీసుకొని దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.

News February 12, 2025

ఆ సమయంలో అన్నీ ఆత్మహత్య ఆలోచనలే: దీపికా పదుకొణె

image

నటి దీపికా పదుకొణె ‘పరీక్షా పే చర్చ’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువు, క్రీడలు, మోడలింగ్ తర్వాత యాక్టింగ్.. ఇలా జీవితంలో ఎన్నో మార్పులు చూసినట్లు తెలిపారు. 2014 తర్వాత జీవితంలో సమస్యలతో కుంగుబాటుకు గురైనట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని తెలిపారు. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న ఈ అమ్మడు రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకొని ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు.

News February 12, 2025

రేషన్ కార్డ్‌లపై అదనపుఛార్జి వసూలు చేస్తే కాల్ చేయండి

image

కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు వచ్చే పేద ప్రజలు మీ సేవ కేంద్రంలో ఆన్‌లైన్ సేవల రుసుము ₹45 మాత్రమే చెల్లించాలి. రసీదుపై ప్రింటైన రుసుమ కంటే నయా పైసా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు అని తెలిపారు. అదనంగా వసూలు చేస్తే 040-45676699 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!